సిక్కు గురువు ఆత్మహత్య అత్యంత విచారకరం, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
రైతుల నిరసనకు మద్దతు ప్రకటిస్తూ నిన్న సూసైడ్ చేసుకున్న సిక్కు గురువు బాబా రామ్ సింగ్ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇతరుల క్షేమం కోసమే రామ్ సింగ్ తన జీవితమంతా సేవలు చేశారన్నారు.

రైతుల నిరసనకు మద్దతు ప్రకటిస్తూ నిన్న సూసైడ్ చేసుకున్న సిక్కు గురువు బాబా రామ్ సింగ్ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇతరుల క్షేమం కోసమే రామ్ సింగ్ తన జీవితమంతా సేవలు చేశారన్నారు. రామ్ సింగ్ మృతికి తానెంతో చింతిస్తున్నానని, ఇతరుల కోసం ఆయన జీవించారని అన్నారు. ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం సిక్కు గురువు సూసైడ్ పై స్పందించడం ఇదే మొదటిసారి. అటు పలువురు విపక్ష నేతలు కూడా సిక్కు గురువు ఆత్మహత్య పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని, హద్దులు దాటిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించాలన్నారు. బాబా రామ్ సింగ్ త్యాగానికి ఫలితం ఉండాలని అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కోరారు. ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా సిక్కుగురువు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. మోదీ ప్రభుత్వం ఇక జాప్యం చేయకుండా రైతు చట్టాల రద్దుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
కాగా-రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లమీద సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.