కరెంటు బిల్లు చూసి భజ్జీ షాక్..ఎంతో తెలుసా..?
తాజాగా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కు కూడా అలాంటి సమస్యే వచ్చిపడింది. దాదాపు రూ.33వేలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాకయిన భజ్జీ... ఆ బిల్లును తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా..

అసలే కరోనా కష్టాలు.. అందులో పవర్ బిల్లు చూసిన జనం భయంతో వణికిపోతున్నారు. ఈ తిప్పలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తప్పడం లేదు. కొందరికైతే ఏకంగా లక్షకుపైగా బిల్లులు పంపి.. ఆ తర్వాత మార్చిన వార్తలు మనం చూశాము.
తాజాగా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కు కూడా అలాంటి సమస్యే వచ్చిపడింది. దాదాపు రూ.33వేలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాకయిన భజ్జీ… ఆ బిల్లును తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ‘మొత్తం ఏరియా బిల్లు నాకే పంపారా ఏంటి..? రూ.33,900 బిల్లు వచ్చింది. సాధారణంగా వచ్చే కరెంటు బిల్లుకంటే ఇది 7 రెట్లు ఎక్కువగా ఉంది. వాహ్..’ అంటూ సెటైర్ వేశాడు.
Itna Bill pure mohalle ka lga diya kya ?? @Adani_Elec_Mum ???ALERT: Your Adani Electricity Mumbai Limited Bill for 152857575 of Rs. 33900.00 is due on 17-Aug-2020. To pay, login to Net/Mobile Banking>BillPay normal Bill se 7 time jyada ??? Wah
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 26, 2020
ఈ పోస్టుకు అదానీ ఎలక్ట్రిసిటీ ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. తమకు కూడా భారీగా కరెంటు బిల్లులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదానీ ఎలక్ట్రిసిటీ ఎలా స్పందిస్తుదో చూడాలి .




