వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అక్ష‌య్ ‘బెల్​బాటమ్’​ షూటింగ్ …

క‌రోనా ఆప‌ద స‌మ‌యంలో భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి టాక్ ఆఫ్ ద కంట్రీగా మారారు అక్ష‌య్ కుమార్. ఆయ‌న్ను రియ‌ల్ హీరో అంటూ దేశం మొత్తం పొగిడేసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:57 am, Tue, 28 July 20
వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అక్ష‌య్  'బెల్​బాటమ్'​  షూటింగ్ ...

Akshay Kumar : క‌రోనా ఆప‌ద స‌మ‌యంలో భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి టాక్ ఆఫ్ ద కంట్రీగా మారారు అక్ష‌య్ కుమార్. ఆయ‌న్ను రియ‌ల్ హీరో అంటూ దేశం మొత్తం పొగిడేసింది. ఇది త‌న బాధ్య‌త అంటూ ఒక్క మాట‌లో చెప్పేసిన అక్ష‌య్..తాజాగా త‌న‌ సినిమా షూటింగులకు సన్న‌ద్ద‌మవుతున్నాడు. కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు నిలిచిపోయిన షూటింగులు, అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్​ నటిస్తోన్న చిత్రం ‘బెల్​బాటమ్’​ షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్రణాళిక‌లు రచిస్తోంది. ఆగస్టులో లండన్​ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపనున్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు వివ‌రించారు అక్షయ్​.

సెట్​లో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డాక్ట‌ర్స్ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మాస్కులు, శానిటైజర్లు,ఫేస్​ షీల్డులు, థర్మల్​ స్కీనింగ్​ సహా పలు జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. చాలా రోజుల తర్వాత మళ్లీ సెట్​లో అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉందని, అంతా స‌జావుగా సాగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు ఈ ఖిలాడీ హీరో.

Masks, On-set Doctors and Temperature Checks: Akshay Kumar's ...