అకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ వింత గోళం

తమిళనాడు తీరంలో అకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. రాక్షబంధన్ రోజున రామేశ్వరంలో ఆకాశంలోని ఒక ప్రాంతంలో సూర్యుడు కనువిందు చేశాడు.

అకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ వింత గోళం

తమిళనాడు తీరంలో అకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. రాక్షబంధన్ రోజున రామేశ్వరంలో ఆకాశంలోని ఒక ప్రాంతంలో సూర్యుడు కనువిందు చేశాడు. తెల్లవారుజామున ఉదయించే సమయంలో సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన ఉంగరం ఆకారం క‌నిపించింది. అరగంటకు పైగా ఆకాశంలో క‌నిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు ఆస‌క్తిక‌రంగా తిల‌కించారు. దీనిని హాలో ఎఫెక్ట్ అని అంటారు. ఈ విధంగా సంవత్సరంలోని 365 రోజులలో సుమారు 100 రోజులలో సూర్యుడు ఇలా క‌నిపిస్తాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ దృశ్యం చూప‌రుల‌కు వింత అనుభూతిని క‌లిగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu