కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ హెడ్ గా రాహుల్ ద్రావిడ్

జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణ విధానంలో బీసీసీఐ ఈ విషయం పేర్కొంది.

కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ హెడ్ గా రాహుల్ ద్రావిడ్

జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణ విధానంలో బీసీసీఐ ఈ విషయం పేర్కొంది. ద్రవిడ్‌ నేతృత్వంలో పరిశుభ్రత అధికారి, బీసీసీఐ ఏజీఎం (క్రికెట్‌ ఆపరేషన్స్‌) సభ్యులుగా ఉండే టాస్క్‌ఫోర్స్‌.. ఎన్‌సీఏలో శిక్షణను పర్యవేక్షిస్తుంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్ని స్పష్టంగా, క్రమం తప్పకుండా ఆటగాళ్లకు వివరించడంతో పాటు క్రికెటర్లు నిబంధనల్ని కచ్చితంగా పాటించేలా చూడటం టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతగా మార్గదర్శకాలను విడుదల వెల్లడించారు. ఎన్‌సీఏలో శిక్షణ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, సహాయక.. పరిపాలన సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్‌ఓపీలో పేర్కొన్న నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాల్ని కచ్చితంగా పాటిస్తానంటూ ఎన్‌సీఏకు రాకముందే ఆటగాళ్లు ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఎస్‌ఓపీలో బీసీసీఐ పేర్కొంది.

Click on your DTH Provider to Add TV9 Telugu