చదివింది బీటెక్.. నడుపుతోంది సెక్స్ రాకెట్.. గుంటూరు కుర్రోడి నయా దందా.!

|

Jan 05, 2020 | 5:52 AM

గుంటూరు‌లో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును అర్బన్ పోలీసులు రట్టు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గత కొన్నిరోజులుగా రహస్యంగా సాగుతున్న ఈ దందాకు చెక్ పెట్టారు. నందివెలుగు రోడ్డులోని ఓ గదిలో ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న కీలక సూత్రధారి నిడిగొండ వీరబ్రహ్మంను అదుపులోకి తీసుకోగా.. అతడు బీటిక్ విద్యార్థి అని తెలిసి నిర్ఘాంతపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్‌లో ఓ కాల్ గర్ల్ యాప్‌ను రూపొందించి యువతుల పేర్లతో నంబర్లు […]

చదివింది బీటెక్.. నడుపుతోంది సెక్స్ రాకెట్.. గుంటూరు కుర్రోడి నయా దందా.!
Follow us on

గుంటూరు‌లో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును అర్బన్ పోలీసులు రట్టు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గత కొన్నిరోజులుగా రహస్యంగా సాగుతున్న ఈ దందాకు చెక్ పెట్టారు. నందివెలుగు రోడ్డులోని ఓ గదిలో ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న కీలక సూత్రధారి నిడిగొండ వీరబ్రహ్మంను అదుపులోకి తీసుకోగా.. అతడు బీటిక్ విద్యార్థి అని తెలిసి నిర్ఘాంతపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్‌లో ఓ కాల్ గర్ల్ యాప్‌ను రూపొందించి యువతుల పేర్లతో నంబర్లు ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తూ సీక్రెట్‌గా వ్యభిచారం కొనసాగిస్తున్నాడు. కాగా, వీరబ్రహ్మం, ఉప్పల థామస్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు భూపతి నాగేశ్వరరావు, నల్లపాటి అశోక్‌లను రైడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈస్ట్‌ డీఎస్పీ సుప్రజ మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు.

చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే చదువుకుంటున్న మెరిట్ స్టూడెంట్ వీరబ్రహ్మం కొద్దికాలం కిందట ఆన్లైన్ యాప్ ద్వారా కాల్ గర్ల్స్ కోసం వెతికాడు. ఆ తరుణంలో రవి అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యి.. రూ.30 వేలు కట్టించుకుని హైదరాబాద్‌లోని ఓ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఎంతో ఆశగా ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లిన వీరబ్రహ్మంకు అక్కడ ఎవరూ కనిపించలేదు. రవికి తిరిగి కాల్ చేసినా.. అతడి ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీనితో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించగా.. వారు సరిగ్గా స్పందించలేదు. అయితే వీరబ్రహ్మం తను కూడా ఇలాగే ఇతరులను మోసం చేయవచ్చునని భావించి ఆన్లైన్‌లో ఓ యాప్ క్రియేట్ చేశాడు. కస్టమర్లను ఆకర్షిస్తూ తన నంబర్‌ను సుమారు 151 యువతుల ఐడీలకు జత చేసి.. ఇక తన దందాకు తెర తీశాడు.

ఇలా రెండేళ్లు ఈ వ్యభిచార కార్యకలాపాలను సాగిస్తూ.. ఇద్దరు పిల్లల తల్లితో వీరబ్రహ్మం సహజీవనం చేశాడు. ఆ తరుణంలోనే థామస్ కుమార్ అతడికి పరిచయం కావడంతో ఇద్దరూ కలిసి నందివెలుగు రోడ్డులో ఓ గది అద్దెకు తీసుకుని యథేచ్ఛగా హైటెక్ వ్యభిచారాన్ని సాగిస్తూ వచ్చారు. అయితే ఆ గదికి యువతీయువకుల రాకపోకలు పెరగడంతో గమించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వారు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.