Vadiyalu Recipe: వేసవి వచ్చిందంటే చాలు.. తెలుగువారి లోగిళ్లలో సందడి మొదలవుతుంది. ఓ వైపు ఆవకాయ, మాగాయ, టమాటా అంటూ పచ్చళ్ళు పెడుతూనే.. మరోవైపు వడియాలు పెట్టడానికి రెడీ అవుతారు. ఈరోజు అటుకులు, గుమ్మడియ వడియాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!
రెండు కేజీలు తూగిన గుమ్మడి కాయ ..1
అటుకులు(పలుచని వి)రెండు శేర్లు .
మిర్చి యాభై గ్రాములు.
ఉప్పు తగినంత
కాసింత ఇంగువ
పసుపు కొంచెం.
కొంచెం నిమ్మరసం
ముందుగా గుమ్మడికాయ ని చెక్కు తో సహా సన్నగా చిన్న ముక్కులుగా తురుముకోవాలి. (ఇష్టాన్ని బట్టి గింజలు వేసుకోవచ్చు).
గుమ్మడి తురుముని చేత్తో సాధ్యమైనంత పిండి ప్రక్కన పెట్టాలి. అందులో ఉప్పు, కాస్త పసుపు వేసి కలిపి ప్రక్కన పెట్టి, అటుకులు బాగా కడిగి నీళ్లు వంచేయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సి లో పేస్ట్ లా చేసుకోవాలి. (ఎందుకంటే గింజలు ఉంటే నిలువ చేసినప్పుడు పురుగు పట్టె అవకాశం ఉంది. అందుకని).
ఇక గుమ్మడి తురుము నుంచి నీరుని పూర్తిగా పిండేసి.. అందులో అటుకులను కలిపాలి. పచ్చిమిర్చి పేస్ట్ తో సహా. బాగా కలిసేలా కలిపి రంగు మారకుండా ఉండడడం కోసం కొంచెం నిమ్మరసం వేయాలి. అవసరం అనుకుంటే కాస్త నీళ్లు చిలకరించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక బట్టపై చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. అనంతరం వాటిని రెండు నుంచి మూడు రోజులు బాగా ఎండబెట్టాలి. అవి తడి లేకుండా ఎండి బాగా కరకరలాడేలా అయ్యాక ఓ డబ్బాలో తీసుకుని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని నూనె లో వేయించుకుని తింటే సరి.
Also Read: మీరు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. పటిక బెల్లం, నల్లమిరియాల పొడి కలిపి ఇలా తీసుకుంటే సరి