BJP Big Win: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. క్లీన్ స్వీప్ చేసిన కమల దళం
BJP Big Win:గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది . ఆరు కార్పొరేషన్లను బీజేపీ గెల్చుకుంది. అహ్మదాబాద్ , సూరత్ .,
Gujarat Municipal Election Result 2021: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది . ఆరు కార్పొరేషన్లను బీజేపీ గెల్చుకుంది. అహ్మదాబాద్ , సూరత్ ., భావ్‌నగర్ ,జామ్‌నగర్ , రాజ్‌కోట్ , వడోదరలో కమలం హవా వీచింది. . ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకు గాను భాజపా 466 చోట్ల విజయం సాధించి సత్తా చాటింది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమైపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్‌లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మరోవైపు, అహ్మదాబాద్‌లో ఎంఐఎం పార్టీ 8 స్థానాల్లో సత్తా చాటింది. ఎన్నికల్లో విజయంతో బీజేపీ కార్యాలయం దగ్గర సందడి కన్పించింది.
బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు కార్యకర్తలు. గుజరాత్ సీఎం విజయ్‌రూపానీని అభినందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా . స్వీట్లు తినిపించి వేడుకలు చేసుకున్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీదే విజయమన్నారు అమిత్‌షా. రానున్న బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. ప్రధాని మోదీ కూడా గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీపై నమ్మకాన్ని నిలబెట్టారని అన్నారు. గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి 27 స్థానాల్లో గెలుపొందడంతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నెల 26న సూరత్‌లో జరగబోయే విజయోత్సవ ర్యాలీకి దిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. భావ్‌నగర్‌లో 52 డివిజన్లకు గాను భాజపా 44 స్థానాల్లో గెలుపొందింది.
ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. జామ్‌నగర్‌లో 64 స్థానాలకు గాను బీజేపీ 50 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 11 స్థానాలు, బీఎస్పీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. అహ్మదాబాద్‌లో మొత్తం 192 స్థానాలు ఉండగా.. బీజేపీ 161 స్థానాలతో అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్ 15 స్థానాలు గెలుచుకోగా.. ఎంఐఎం 8 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంకా కొన్ని చోట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Gujarat: Chief Minister Vijay Rupani, state BJP chief CR Patil meet Union Home Minister Amit Shah at his residence in Ahmedabad.#GujaratLocalBodyElection pic.twitter.com/4eyRuKoBXX
— ANI (@ANI) February 23, 2021
ఇవి కూడా చదవండి
చనిపోయినవాళ్లూ లోన్లు తీసుకున్నారు.. కోటీ రెండు కోట్లు కాదు.. ఏకంగా 23 కోట్ల.. ఎక్కడో కాదు..!
Antarvedi Rathodsavam: జన సంధ్రమైన అంతర్వేది.. వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం