కోవిడ్ నిబంధనలు పాటించని ఆస్పత్రులకు జరిమానా

కొవిడ్ నిబంధనలు పాటించని రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భారీ జరిమానా విధించింది.

కోవిడ్ నిబంధనలు పాటించని ఆస్పత్రులకు జరిమానా
Follow us

|

Updated on: Jun 09, 2020 | 9:43 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్స నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు పాటించని రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా జులుపించారు. రెండు దవఖానాలపై అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది. 7 రోజుల్లోపు మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించింది. లేదంటే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది గుజరాత్ ప్రభుత్వం.