Tirumala Tirupati News: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై గ్రీన్ మంత్రా లడ్డూ బ్యాగులు.. వివరాలు ఇవి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్. శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో కొత్తగా గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు
TTD News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్. శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో కొత్తగా గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని చెప్పారు. 180 రోజుల్లో ఈ బ్యాగు ఎరువుగా మారుతుందని వెల్లడించారు. రూ. 5 లడ్డూలు పట్టే బ్యాగు ధర రూ.3, 10 లడ్డూలు పట్టేది రూ.6కు అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న పేపర్, జనపనార బ్యాగుల ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
మరోవైపు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. భక్తులు ఈ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. కాగా, ఈ టికెట్లు tirupatibalaji. ap. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టికెట్లతో పాటు తిరుమలలో గదుల కోటాను కూడా ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. కాగా, లాక్‌డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
Also Read:
తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’