20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి ఈ ప్రాతిప‌దిక‌న డ‌బ్బు జ‌మ‌…

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్​డౌన్ తో దేశంలో గ‌డ్డు ప‌రిస్థితులు ఏర్పడిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందుల‌ను త‌గ్గించాల‌న్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్​ధన్ ఖాతాల్లోకి నెల‌కు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్​ తెలిపారు. ఈ కారక్ర‌మంలో భాగంగా.. తొలి విడతలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి రూ.500లను ప్రభుత్వం ట్రాన్ఫ‌ర్ చేసిందని […]

20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి ఈ ప్రాతిప‌దిక‌న డ‌బ్బు జ‌మ‌...
Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:55 PM

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్​డౌన్ తో దేశంలో గ‌డ్డు ప‌రిస్థితులు ఏర్పడిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందుల‌ను త‌గ్గించాల‌న్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్​ధన్ ఖాతాల్లోకి నెల‌కు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్​ తెలిపారు. ఈ కారక్ర‌మంలో భాగంగా.. తొలి విడతలో భాగంగా 20 కోట్ల మంది మహిళల జన్​ధన్​ ఖాతాల్లోకి రూ.500లను ప్రభుత్వం ట్రాన్ఫ‌ర్ చేసిందని అధికారులు తెలిపారు. ప్ర‌తి ఖాతాదారుని అకౌంట్ లో డ‌బ్బు జ‌మైంద‌ని, ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించి..డ‌బ్బు విత్ డ్రా చేసుకోవాల‌ని నిర్మ‌లా సీతారామన్ సూచించారు. ఈ క్ర‌మంలో ల‌బ్దిదారుల‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ) ఏప్రిల్​ నెలలో అన్ని బ్యాంకులకు మార్గ‌నిర్దేశకాలు జారీ చేసింది.

కాగా జన్​ధన్​ ఖాతాల్లో లబ్ధిదారుని అకౌంట్ చివ‌రి అంకె ఆధారంగా డ‌బ్బు ముందు జమ అవుతుంది. 0 లేదా 1తో ముగిసిన అకౌంట్ హోల్డ‌ర్స్ కి ఏప్రిల్​ 3న, 2 లేదా 3తో ముగిసిన ఖాతాదారుల‌కు ఏప్రిల్​ 4న, 4లేదా 5 తో ముగిస్తే (ఏప్రిల్​7), 8లేదా9 ఎండ్ అయితే (ఏప్రిల్​9) ఖాతాల్లో డ‌బ్బు క్రెడిట్ అవుతుంద‌ని తెలిపారు. మరో రెండు విడతల్లో మే, జూన్​ నెలల్లో డ‌బ్బు అకౌంట్స్ లో వేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్లడించారు.