మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

|

Aug 23, 2020 | 7:03 AM

కరోనా వైరస్‌కు 'కొవాగ్జిన్ వ్యాక్సిన్' రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు మరో ప‌ర్మిష‌న్ లభించింది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ రూల్స్‌లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్‌ అంగీకరించిందని స‌మాచారం.

మరో కీలక అనుమతి పొందిన కొవాగ్జిన్ !
Follow us on

కరోనా వైరస్‌కు ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు మరో ప‌ర్మిష‌న్ లభించింది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ రూల్స్‌లో మార్పు చేసేందుకు ప్రభుత్వ ప్యానెల్‌ అంగీకరించిందని స‌మాచారం. చర్మం కింది పొరలో వ్యాక్సిన్ ఇచ్చే ట్రయల్స్‌ చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా వ్యాక్సిన్ అనేక మార్గాల ద్వారా ఇస్తారు. ఎక్కువగా కండరాలకు ఇస్తారు. భుజాలు, పిరుదులకు వ్యాక్సిన్ ఇవ్వడం రెగ్యుల‌ర్‌గా చూస్తూనే ఉంటాం. దీనిని ఇంట్రామస్కులర్‌ రూట్‌ అంటారు.

కొన్ని వ్యాక్సిన్‌ల‌ను సెలైన్‌, నోరు, నరాల ద్వారా ఇస్తారు. అలాగే కొన్నింటికి చర్మం కింద వున్న పొరకు ఇస్తారు. దీనినే ‘ఇంట్రాడెర్మల్‌ రూట్’ అంటారు. రెండు నిబంధ‌న‌ల‌కు లోబడి కొవాగ్జిన్‌తో ఇలా ట్రయల్స్‌ చేపట్టేందుకు అనుమతులు లభించాయని స‌మాచారం. చర్మం కింద పొరకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్య‌త ఉంది. ఎందుకంటే కండరాలకు ఎక్కువ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అదే చర్మం కింద పొరకైతే త‌క్కువ మోతాదు సరిపోతుంది. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ధర కూడా త‌గ్గుతుంది. భారత్‌ లాంటి పేద‌రికం, అధిక జనాభా ఉన్న దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా దేశవ్యాప్తంగా 12 హాస్పిట‌ల్స్‌లో 1125 మందిపై కొవాగ్జిన్‌ మొదటి, రెండో ఫేజ్‌ క్లినికల్‌ ట్రయల్స్ జ‌రుగుతున్నాయి. త్వరలోనే మూడో దశ ప్రయోగాలు మొదలవుతాయని స‌మాచారం.

Also Read : “‘అర్జున’ గెలిచేందుకు ఇంకా ఏం చేయాలి”