“‘అర్జున’ గెలిచేందుకు ఇంకా ఏం చేయాలి”

జాతీయ క్రీడా దినోత్సవం నేప‌థ్యంలో అర్జున అవార్డుల కోసం 29 మందిని సెలక్షన్‌ కమిటీ రిక‌మండ్ చేసింది. వీరిలో నుంచి సాక్షి మాలిక్, మీరాబాయ్‌లను తప్పించిన కేంద్ర‌ క్రీడల శాఖ.. మిగతా వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

'అర్జున' గెలిచేందుకు ఇంకా ఏం చేయాలి
Follow us

|

Updated on: Aug 22, 2020 | 6:25 PM

జాతీయ క్రీడా దినోత్సవం నేప‌థ్యంలో అర్జున అవార్డుల కోసం 29 మందిని సెలక్షన్‌ కమిటీ రిక‌మండ్ చేసింది. వీరిలో నుంచి సాక్షి మాలిక్, మీరాబాయ్‌లను తప్పించిన కేంద్ర‌ క్రీడల శాఖ.. మిగతా వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాక్షికి అదే సంవ‌త్స‌రం ఖేల్‌రత్న లభించింది. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేత మీరాబాయ్‌కు తర్వాతి ఏడాది ఖేల్‌రత్న అవార్డుతో స‌త్క‌రించింది ప్ర‌భుత్వం.

అయితే సాక్షి, మీరాబాయ్‌లు ఈ ఏడాది అర్జున అవార్డుకు అప్లై చేసుకున్నారు. సెలక్షన్‌ కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయడంపై విమర్శలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో గతంలోనే అత్యున్నత క్రీడా పురస్కారాలు అందుకున్న సాక్షి, మీరాబాయ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వకూడదని క్రీడల శాఖ డిసైడ‌య్యింది. ఈ విషయమై స్పందించిన సాక్షి మాలిక్ నిరాశ వ్యక్తం చేసింది.

“అర్జున అవార్డీగా పిలిపించుకోవాలని ఆరాట‌ప‌డేదాన్ని. దీన్ని గెలిచేందుకు ఇంకా ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు. 2016లో ఖేల్​రత్న వచ్చినందుకు ఆనంద‌పడ్డా. కానీ నేను కోరుకునేది అర్జున. అదే నా డ్రీమ్” అని సాక్షి మాలిక్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కాగా కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !