AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

Good News To Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రైతులకు దేశ వ్యాప్తంగా ఇచ్చే రుణాల పరిమితి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 7 శాతం వడ్డీ చెల్లిస్తూ గరిష్ఠంగా మూడు లక్షల వరకు..షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె..రైతుల ఆదాయాన్ని 2022కు రెట్టింపు చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు […]

Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2020 | 5:00 PM

Share

Good News To Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రైతులకు దేశ వ్యాప్తంగా ఇచ్చే రుణాల పరిమితి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 7 శాతం వడ్డీ చెల్లిస్తూ గరిష్ఠంగా మూడు లక్షల వరకు..షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె..రైతుల ఆదాయాన్ని 2022కు రెట్టింపు చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో భాగంగానే కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం రూ. 1.6 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్టు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతుల కారణంగా అన్నదాతల రుణ పరిమితిని పెంచినట్లు తెలిపిన ఆమె..గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అందే రుణాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఒక్క  పీఎం కిసాన్‌ పథకానికి రూ.75వేల కోట్లు కేటాయించామని..రైతులు ఆనందమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోన్స్ టార్గెట్ రూ. 13.5 లక్షలు కోట్లు ఉందని పేర్కొన్నారు. 2021 లోగా దీన్ని రూ. 15 లక్షల కోట్లకి చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. మూములుగా ప్రతి ఏడాది రుణ లక్ష్యాన్ని 9 శాతం మాత్రమే పెంచుతారని, కానీ ఎన్డీఏ ప్రభత్వం మాత్రం 11 శాతం పెంచినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..