కేరళ గోల్డ్ కేసు: ఎన్ఐఏ అదుపులో కస్టమ్స్ జాయింట్ కమిషనర్

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బంగారు అక్రమ రవాణా కేసులో ఆరోపణలు రావడంతో కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనీష్ రాజన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నాగ్‌పూర్‌కు తరలించారు. కేరళలో అధికార పార్టీ సిపిఎంతో లింకులు ఉన్నాయని, అనీష్ ఈ కేసు నుండి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రక్షించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు..

Follow us

|

Updated on: Jul 31, 2020 | 6:13 AM

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బంగారు అక్రమ రవాణా కేసులో ఆరోపణలు రావడంతో కస్టమ్స్ జాయింట్ కమిషనర్ అనీష్ రాజన్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు నాగ్‌పూర్‌కు తరలించారు. కేరళలో అధికార పార్టీ సిపిఎంతో లింకులు ఉన్నాయని, అనీష్ ఈ కేసు నుండి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రక్షించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు..

తిరువనంతపురం విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్న తరువాత, చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి కస్టమ్స్ కార్యాలయానికి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని అనిష్ రాజన్ మీడియాతో చెప్పారు. ఈ కేసులో సీఎంవో తో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పే విధంగా ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన ఎన్ఐఏ అధికారులు అనీష్ ను కూడా విచారించాలని భావించింది. దీంతో అయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అనీష్ రాజన్ అన్నయ్య సిపిఎం కౌన్సిలర్ గా ఉన్నారు. అనీష్ ఇటీవల చేసిన ఫేస్ బుక్ పోస్ట్ కూడా వివాదానికి దారితీసింది. ఉన్నత పదవిలో పనిచేసే ఐఆర్ఎస్ అధికారి సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్ట్ చేయకూడదు. అయితే, అంతకు ముందు కూడా అనీష్ ఇలాంటి తప్పులు చేశాడని కేరళ ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు చేశాయి. అనీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతని అదపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.

Latest Articles
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..

చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..