Viral Video: అమ్మాయి కాదు ‘అద్భుతం’.. కళ్లు చెదిరే స్టంట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. షాకింగ్ వీడియో మీకోసం..!

Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. తాజాగా ఓ అమ్మాయి వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా హైహీల్స్ వేసుకుని నడవటమే కష్టం రా బాబూ అంటూ..

Viral Video: అమ్మాయి కాదు ‘అద్భుతం’.. కళ్లు చెదిరే స్టంట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. షాకింగ్ వీడియో మీకోసం..!
Trending
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 01, 2022 | 6:40 AM

Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. తాజాగా ఓ అమ్మాయి వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా హైహీల్స్ వేసుకుని నడవటమే కష్టం రా బాబూ అంటూ.. ఈ అమ్మాయి ఏకంగా కళ్లు చెదిరే ఫీట్స్ చేసి ఔరా అనిపించింది. ఆ వీడియోను నెటిజన్ల మతిపోతోంది. ఇంత టాలెంట్ ఎలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో కనిపించే అమ్మాయి పేరు దిల్నోజా. ఆమె ఒక ఆర్టిస్ట్. దుబాయ్‌కి చెందిన దిల్నోజా.. అద్భుత విన్యాసాలు చేస్తూ ఉంటుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి షాకింగ్ స్టంట్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో దిల్నోజా.. హైహీల్స్ ధరించి, స్టైలీష్ డ్రెస్ వేసుకుంది. చేతిలో ఒక వైన్ గ్లాస్ పట్టుకుని.. కార్ట్ వీల్ స్టంట్ చేసింది. చేతిలో ఉన్న గ్లాస్‌లోని వైన్ ఏమాత్రం కింద పడకుండా.. ఆ స్టంట్ చేయడం నిజంగా ఆశ్చర్యం. ఈ స్టంట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది మామూలు స్టంట్ కాదంటూ నోరెళ్ల బెడుతున్నారు నెటిజన్లు. అయితే, దిల్నోజా అంత సులభంగా ఎలా స్టంట్ చేసిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా dilya.abdusalimovaలో షేర్ చేయగా.. విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ఆమె స్టంట్‌ను పొడుగుతూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Also read:

LSG vs CSK, IPL 2022: ఏం కొట్టారు సామీ.. ఉత్కంఠ పోరులో చెన్నైని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్..

Summer Alert: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. పిల్లలపై ఓ లుక్కేసి ఉంచండి.. లేదంటే పెనుముప్పు తప్పదు..!

Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?