రూ.50 వేలకు మించితే అంతే.. లెక్క చెప్పకుంటే సీజ్.. హైదరాబాద్ పోలీస్ వార్నింగ్..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పోలీసుల ఝలక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో హవాలా రూటింగ్‌పై నజర్‌ పెట్టారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:03 pm, Sat, 21 November 20
రూ.50 వేలకు మించితే అంతే.. లెక్క చెప్పకుంటే సీజ్.. హైదరాబాద్ పోలీస్ వార్నింగ్..!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పోలీసుల ఝలక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో హవాలా రూటింగ్‌పై నజర్‌ పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే హవాలా వ్యాపారులతో టచ్‌లోకెళ్లారు నేతలు. బేగంబజార్‌ కేంద్రంగా హవాలా రూటింగ్‌ నడుస్తున్నట్టు తేల్చిన పోలీసులు.. హవాలా గ్యాంగ్‌లకు పనిచేస్తున్న సప్లయర్స్‌పై కన్నేశారు. మూడు రోజుల్లో కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాదులో వాతావరణం వాడి వేడిగా మారిపోయింది. అన్ని పార్టీల నేతలు ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో అనేది చెబుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుండడంతో భారీగా హవాలా నగదు పట్టుబడుతోంది. ఇక తాజాగా దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తో పట్టుబడితే నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. 50వేల కంటే ఎక్కువ నగదు ఉన్నప్పుడు తప్పనిసరిగా రశీదు చూపించాలన్నారు. లేదంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.