GHMC Election Results 2020 : నేరెడ్‌మెట్ డివిజన్‌లో విచిత్ర పరిస్థితి.. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లే అధికం..మినహా ముగిసిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్ మెట్ డివిజన్ మినహా పూర్తయింది. నేరేడ్ మెట్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర...
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్ మెట్ డివిజన్ మినహా పూర్తయింది. నేరేడ్ మెట్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇక, గ్రేటర్ లో మొత్తం150 డివిజన్లకు జరిగిన పురపోరులో కారు పార్టీకి 55 స్థానాల్లో విజయం వరించింది. బీజేపీకి అనూహ్యంగా 48 స్థానాల్లో విజయం లభించింది. ఎంఐఎం పాతబస్తీలో తన పట్టును నిలుపుకుని పోటీచేసిన 51 స్థానాలకు గాను 44 డివిజన్లలో గెలుపొందింది. కాగా, గత ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైన తెలంగాణ కాంగ్రెస్… ఈసారి కూడా ఆ రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక, తెలుగుదేశం పార్టీ జీహెచ్ఎంసీలో ఖాతా తెరవలేకపోయింది.