#GetWellSoonTHALA ట్రెండింగ్.. అజిత్ క్రేజ్ మాములుగా లేదుగా…
తమిళ స్టార్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత తలా అజిత్ కుమార్‌కు మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇటీవల 'వాలిమై' షూటింగ్‌లో గాయాలైన సంగతి తెలిసిందే. అజిత్ ఎక్కువగా డూప్‌లు లేకుండానే యాక్షన్ స్టంట్స్ చేస్తుంటారు.
GetWellSoonTHALA: తమిళ స్టార్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత తలా అజిత్ కుమార్‌కు మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇటీవల ‘వాలిమై’ షూటింగ్‌లో గాయాలైన సంగతి తెలిసిందే. అజిత్ ఎక్కువగా డూప్‌లు లేకుండానే యాక్షన్ స్టంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాలోని ఓ బైక్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ ఆపేశారు. అరగంట పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత హీరో అజిత్ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.
Also Read: Anupama In Love
ఇదిలా ఉంటే తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. అందులో భాగంగానే #GetWellSoonTHALA అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 83 వేల ట్వీట్లు చేయడం విశేషం. ప్రస్తుతం ట్విటర్ ఈ హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లో ముందు వరుసలో ఉంది. కాగా, ‘వాలిమై’ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.