Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Anupama Tweets: అనుపమా! ఎవరా అజ్ఞాత ప్రేమికుడు చెప్పవమ్మా.!

'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. 'అఆ' చిత్రంతో ఫ్యాన్స్ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నిజంగానే ప్రేమలో పడిందా.. ఇంతకీ ఎవరా అజ్ఞాత ప్రేమికుడు..
Anupama Tweets, Anupama Tweets: అనుపమా! ఎవరా అజ్ఞాత ప్రేమికుడు చెప్పవమ్మా.!

Anupama Tweets: ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ‘అఆ’ చిత్రంతో ఫ్యాన్స్ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈమె తమిళంలో రెండు చిత్రాలు చేస్తుండగా.. తెలుగులో ‘రాక్షసుడు’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేరళ కుట్టి రీసెంట్‌గా తన పుట్టినరోజు జరుపుకుంది.

Also Read: Thala Ajith Kumar Craze In Twitter 

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టి తనకు 24 ఏళ్లు వచ్చాయంటూ చెప్పకనే చెప్పింది. అంతేకాక సముద్రపుటంచున సేద తీరుతున్న ఓ దంపతుల ఫోటోను పెడుతూ ‘నువ్వు నేను ఈ అందమైన ప్రపంచంలో’ అంటూ కామెంట్‌ కూడా చేసింది. దీనితో అనుపమ ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఇదొక్క హింట్‌ మాత్రమే కాదు.. అటు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ఇన్‌స్టా అకౌంట్‌లో సరిగ్గా అనుపమను అనుకరిస్తున్న పోస్టు ఒకటి పెట్టడంతో ఇప్పుడు వీరిద్దరే నెట్టింట్లో హాట్ టాపిక్. ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అని ఫ్యాన్స్ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

Don’t grow up, it’s a trap!😋

A post shared by jasprit bumrah (@jaspritb1) on

 

Related Tags