నయీమ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలి.. గవర్నర్‌కు లేఖ రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసింది. నయీమ్ కేసులో 24 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ నివేదిక ఇవ్వగా...
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసింది. నయీమ్ కేసులో 24 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ నివేదిక ఇవ్వగా, రూ.2.16 కోట్లు, రెండు కిలోల బంగారం, మూడు కిలోల వెండి ఎలా వచ్చిందని, దీనిపై పూర్తి దర్యాప్తు జరిపించాలని లేఖలో పేర్కొంది. అలాగే నయీమ్‌కు ఇన్ని ఆయుధాలు ఎలా వచ్చాయని, అలాగే పోలీసు దగ్గర ఉండే సామాగ్రి నయీమ్‌కు ఎలా చేరిందని ప్రశ్నించింది.
అలాగే 24 తుపాకుల్లో మూడు ఏకే47, 9 పిస్టల్స్, 3 రివాల్వర్లు, 7 తపంచాలు, ఒక బోర్ గన్, ఒక స్టెన్‌గన్, రెండు గ్రనేడ్లు, జిలిటెన్స్టిక్స్ , ఐదు కిలోల అమోనియం నైట్రేట్, 616 కిలోల బుల్లెట్లు, 6 మ్యాక్టిన్లు, 30 డిటోనేర్లు సీజ్ చేసినట్లు ఇది వరకు సిట్ అందించిన నివేదికలో పేర్కొంది. అయితే ఇంత మొత్తంలో తుపాకులు, ఇతర సమాగ్రి నయీమ్ దగ్గరకు ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొంది.
కాగా, 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నయీం చనిపోయిన తర్వాత అతడి కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నయీమ్ దందాలు, దారుణాలు బయటకు రావడం తీవ్ర సంచలనం రేపింది. నయీం దారుణాలు ఒక్కొక్కటికి బయట పడటంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేసులో సంబంధమున్న పలువురు అధికారులు కూడా సస్పెండ్‌కు గురయ్యారు.