సినీ ఫక్కీలో గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత..

హర్యానాలో గ్యాంగ్‌ వార్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ గ్యాంగ్‌స్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గుర్‌గ్రామ్‌లోని ఫిరోజ్ గాంధీ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు.. వికాస్‌ దురేజా అలియాస్ విక్కీగా గుర్తించారు పోలీసులు. ఇతను గ్యాంగ్‌స్టర్‌ బిరేందర్‌ సింగ్‌ ద్యామాకు కుడిభుజం లాంటి వాడని తెలుస్తోంది. రోజులానే అతడు తన కార్యాలయానికి కారులో బయల్దేరుతుండగా.. ప్రత్యర్ధులు అతడిపై దాడికి యత్నంచారు. అయితే అది గమనించిన విక్కీ.. వెంటనే తన కారును రివర్స్‌ చేసి […]

సినీ ఫక్కీలో గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత..
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 12:57 PM

హర్యానాలో గ్యాంగ్‌ వార్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ గ్యాంగ్‌స్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గుర్‌గ్రామ్‌లోని ఫిరోజ్ గాంధీ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు.. వికాస్‌ దురేజా అలియాస్ విక్కీగా గుర్తించారు పోలీసులు. ఇతను గ్యాంగ్‌స్టర్‌ బిరేందర్‌ సింగ్‌ ద్యామాకు కుడిభుజం లాంటి వాడని తెలుస్తోంది. రోజులానే అతడు తన కార్యాలయానికి కారులో బయల్దేరుతుండగా.. ప్రత్యర్ధులు అతడిపై దాడికి యత్నంచారు. అయితే అది గమనించిన విక్కీ.. వెంటనే తన కారును రివర్స్‌ చేసి తప్పించుకోబోయాడు. కానీ అక్కడ రోడ్‌ ఎండ్‌ ఉండటంతో.. ప్రత్యర్ధులు అతడినపై కాల్పులకు దిగి కాల్చిచంపేశారు. ఈ సంఘటన అతడి ఇంటికి మూడు నాలుగు వందల మీటర్ల దూరంలోనే జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని గుర్‌గ్రామ్ క్రైం బ్రాంచ్ ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు.