Variety Thieves: వీళ్లు కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో

వివాహాల్లో ఆభరణాలు, డబ్బులు కొట్టేసేవాళ్లను చూసే ఉంటాం... ఇప్పుడు చూసేది వెరైటీ...బహుమతులను కొట్టేసే ముఠా కొత్తగా వెలుగులోకి వచ్చింది. అలాంటి గ్యాంగ్‌ను శంషాబాద్‌ ఎస్‌ఓటీ....

Variety Thieves:  వీళ్లు  కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 05, 2021 | 6:24 PM

Variety Thieves:  వివాహాల్లో ఆభరణాలు, డబ్బులు కొట్టేసేవాళ్లను చూసే ఉంటాం… ఇప్పుడు చూసేది వెరైటీ…బహుమతులను కొట్టేసే ముఠా కొత్తగా వెలుగులోకి వచ్చింది. అలాంటి గ్యాంగ్‌ను శంషాబాద్‌ ఎస్‌ఓటీ, మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రధాన నిందితురాలు కావడం ఇక్కడ ట్విస్టు.

వివాహాల్లో బంధువులా వచ్చి బహుమతులు కొట్టేసే ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గతనెల 7న మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరుగుతుండగా ఓ మహిళ, ఎనిమిదేళ్ల చిన్నారి మరో ఇద్దరు వ్యక్తులు కారులో అక్కడికి వచ్చారు. సొంత బంధువుల్లా బిహేవ్ చేశారు. ప్యాక్‌ చేసిన బాక్సులు, ఇతర పెళ్లి కానుకలు సర్దేశారు. వేడుకలోని బహుమతులను ఓ బాలిక తీసుకెళ్లి కారులో పెడుతున్న సంగతి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది.

బహుమతులు మాయమయ్యాయని పెళ్లివారు మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో జరిగిన విందు వేడుకలోనూ అలాంటి చోరీ జరిగింది. శంషాబాద్‌ ఎస్‌ఓటీ, మైలార్‌దేవుపల్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేయగా నిందితులు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా పిల్‌ప్లే రసోడా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రులను, మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 50వేల రూపాయల విలువైన గిఫ్టు బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొందరికి తాము ఢిల్లీకి చెందినవారమని, మరికొందరికి ఇరాన్‌ నుంచి వచ్చి జీవిస్తున్నామని ప్రాంతాల వారిగా నమ్మించి ఈ ముఠా మాయ చేసింది. ఇతర్రాష్ట్రాల్లో, నగరాల్లోనూ ఇలాంటి చోరీలకు ఈ ముఠా పాల్పడింది. మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఇరాన్‌ పేర్లలోని ఫస్ట్‌ లెటర్స్‌తో MDI గ్యాంగ్‌గా పోలీసులు ఈ ముఠాను పిలుస్తున్నారు. ఈ ముఠా నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Also Read:

ఈ టాలీవుడ్ టాప్ హీరో తనయుడు ఎవరో గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్…?

ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కేసులో సంచలనం.. కారు ఓనర్ అనుమానాస్పద మృతి