రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు. 50 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల్లోపే...

  • Tv9 Telugu
  • Publish Date - 2:21 pm, Tue, 26 May 20
రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రెండో రోజులో భాగంగా.. సీఎం జగన్ వ్యవసాయంపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులకు చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చామన్నారు. 50 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల్లోపే భూమి ఉంది. రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నాం. నేరుగా రైతుల అకౌంట్లలోనే డబ్బు జమచేశాం. కేవలం రైతుల కోసమే వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చాం. వడ్డీ కోసం రూ.2 వేల కోట్లను ఏపీ ప్రభుత్వమే కడుతుందన్నారు.

ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్‌న్యూస్ ప్రకటించారు సీఎం జగన్. ఈ ఖరీఫ్ నుంచి ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. గత రబీలోనే 46.69 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మొదటి ఏడాదిలోనే రూ.6,534 కోట్లను ఇచ్చాం. ఈ నెలలోనే 7,800 చొప్పున రూ.3,675 కోట్లను రైతులకు ఇచ్చామన్నారు సీఎం జగన్.

మరిన్ని వివరాలు ఈ కింది లైవ్‌లో చూడండి:

Read More: 

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!