1.58 లక్షల మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించిన తెలంగాణ సర్కార్

కరోనా మహమ్మారీ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో దేశంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చాటుకుని వలస కూలీలందరికీ రాష్ట్రంలో రేషన్ కార్డులతో సమానం బియ్యం, డబ్బులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కల్పించారు. […]

1.58 లక్షల మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించిన తెలంగాణ సర్కార్
Follow us

|

Updated on: May 26, 2020 | 2:15 PM

కరోనా మహమ్మారీ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో దేశంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చాటుకుని వలస కూలీలందరికీ రాష్ట్రంలో రేషన్ కార్డులతో సమానం బియ్యం, డబ్బులు పంపిణీ చేశారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కల్పించారు. ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా చేరవేడంతో పాటు వారికి భోజన వసతి కూడా కల్పించాలని అదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక లక్ష 58 వేల మంది వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించామని, ఇందుకోసం రూ.13.15 కోట్లు ఖర్చు చేశామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతోనే కూలీలను తరలిస్తున్నామని చెప్పారు. వలస కూలీల తరలింపు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. ఒక్క పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీలు మినహా మిగతా రాష్ట్రాల వారందరినీ దాదాపుగా తరలించామని సీఎస్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు చక్కబడ్డాక, వారిని కూడా తరలిస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో వారిని పంపేందుకు 10 రైళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లలేనివారికి తెలంగాణలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల పట్ల వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు