లాక్‌డౌన్ సడలింపులు: ప్రైవేట్ హెలికాప్టర్లు, ఫ్లైట్లకు గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను నడుపుతున్న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, తాజాగా ప్రైవేట్ హెలికాప్టర్లు

లాక్‌డౌన్ సడలింపులు: ప్రైవేట్ హెలికాప్టర్లు, ఫ్లైట్లకు గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 2:44 PM

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను నడుపుతున్న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, తాజాగా ప్రైవేట్ హెలికాప్టర్లు, చార్టర్డ్‌ ఫ్లైట్లకు కూడా అనుమతిని ఇచ్చింది. అయితే వేరే రాష్ట్రంలోకి వెళ్లే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఇక దేశీయ విమానాలకు వర్తించే మార్గదర్శకాలే వీటికి కూడా వర్తిస్తాయని తెలిపింది.

ప్రయాణానికి 45 నిమిషాల ముందుగా ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకొని థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, వృద్ధులు, గర్భవతులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణాలను మానుకోవడమే మంచిదని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ధర విషయంలో ఆపరేటర్, ప్యాసెంజర్‌ మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవాలని పేర్కొంది. అలాగే ఆహారం వెంట తెచ్చుకోవాలని, వెబ్‌ చెక్ ఇన్, ఎలక్ట్రానిక్ పేమెంట్ తప్పనిసరని వెల్లడించింది. ఇక ఫేస్ మాస్క్‌ ధరించాలని, ఆరోగ్య సేతు యాప్‌ కూడా ఉండాలని తెలిపింది. ఒకవేళ యాప్ లేకపోతే స్వయంగా డిక్లరేషన్ పత్రం ఇవ్వాలని సూచించింది. వీటన్నింటితో పాటు ప్రయాణం తరువాత ఎయిర్‌క్రాఫ్ట్ లేదా హెలికాప్టర్‌ని తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని తెలిపింది. కాగా కేంద్ర తాజా సడలింపులతో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఈ హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Read This Story Also: ఏపీలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి నిరాకరణ