చెప్పుల్లేకుండా నడిచా.. ‘ ఇస్రో ‘ చీఫ్ శివన్ సింపుల్ లైఫ్..

చంద్రయాన్-2 మిషన్ ‘ సారథి ‘ , ఇస్రో చైర్మన్ డా. కె. శివన్ జీవితం పూలపాన్పు కాదట.. అతి సామాన్య జీవితం నుంచి తాను వచ్చానని ఆయన చెప్పుకున్నారు. తన తండ్రి ఓ రైతు అని, కాలేజీలో అడుగు పెట్టేంత వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచానని ఆయన ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. నా స్టూడెంట్ లైఫ్ లో ట్రౌజర్లు కాకుండా ధోతీలు మాత్రమే ధరించేవాడినని, తన తండ్రికి వ్యవసాయంలో, మామిడి […]

చెప్పుల్లేకుండా నడిచా.. ' ఇస్రో ' చీఫ్ శివన్ సింపుల్ లైఫ్..
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 3:32 PM

చంద్రయాన్-2 మిషన్ ‘ సారథి ‘ , ఇస్రో చైర్మన్ డా. కె. శివన్ జీవితం పూలపాన్పు కాదట.. అతి సామాన్య జీవితం నుంచి తాను వచ్చానని ఆయన చెప్పుకున్నారు. తన తండ్రి ఓ రైతు అని, కాలేజీలో అడుగు పెట్టేంత వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచానని ఆయన ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. నా స్టూడెంట్ లైఫ్ లో ట్రౌజర్లు కాకుండా ధోతీలు మాత్రమే ధరించేవాడినని, తన తండ్రికి వ్యవసాయంలో, మామిడి తోటలో పనులకు సాయపడేవాడినని ఆయన చెప్పారు. రైతు అయినప్పటికీ నా తండ్రి మామిడి పండ్ల సీజన్ లో మ్యాంగో బిజినెస్ చేసేవారు. ఆ సందర్భాల్లో నా సెలవు రోజుల్లో ఆయనకు సహాయపడేందుకు మామిడి తోటకు నేను కూడా వెళ్ళేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు ఆయన వేరే కూలీని పెట్టుకునేవారు కారు ‘ అని శివన్ పేర్కొన్నారు. తాను కాలేజీ చదువు చదువుతున్నప్పుడు కూడా పంట పొలాలకు వెళ్ళేవాడినని, నేను చదివే కళాశాల మా ఇంటికి దగ్గరగా ఉండాలని, దానివల్ల ఆయనకు నేను సహాయపడేందుకు వీలుంటుందని భావించేవారని శివన్ వెల్లడించారు. ‘ చేతికి, నోటికి ఉన్న బంధం మాది ‘ అని ఆయన అభివర్ణించారు.

మద్రాస్ ఇన్స్ టి ట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నప్పటి నుంచే నేను చెప్పులు ధరిస్తూ వచ్చాను.. అప్పటివరకు వట్టికాళ్లతోనే నడిచేవాడ్ని.. ఎన్ని బాధలు, కష్టాలు పడుతున్నా నా తలిదండ్రులు నాకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెట్టేవారు అని ఆయన చెప్పారు. తన ఇంజనీరింగ్ చదువు చదివించడానికి తన తండ్రికి ఆర్ధిక స్తోమత లేకపోవడంతో తాను బీఎస్సీ చదవాల్సివచ్చిందని, ఆయన మనస్సు మారేందుకు తను వారం రోజులపాటు తిండి తినకుండా నిరసన వ్యక్తం చేశానని శివన్ పేర్కొన్నారు. . చివరకు నా తండ్రి దిగివఛ్చి… పొలం అమ్మి నా ఇంజనీరింగ్ చదువుకు అయ్యే ఫీజును చెల్లిస్తా అన్నారు.

బీ టెక్ అయ్యాక ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించా.. అప్పట్లో ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉండేవి.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో మరీ తక్కువగా ఉండేవి.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ లో మాత్రమే జాబ్స్ ఉండేవి.. కానీ జాబ్ దొరక్కపోవడంతో ఐఎస్సిలో ఉన్నత చదువుకోసం వెళ్ళాను అని ఆయన చెప్పారు. అనంతరం విక్రమ్ సారాభాయ్ సెంటర్ లో చేరానని, అక్కడ ఏరోడైనమిక్స్ గ్రూపులో చేరాలనుకున్నప్పటికీ.. పీ ఎస్ ఎల్వీ ప్రాజెక్టులో చేరాల్సివచ్చిందని శివన్ వివరించారు. ఎక్కడా నేను ఆశించిన ఉద్యోగం లభించలేదు.. అయినా నేను బాధ పడలేదు అని ప్రముఖ శాస్త్రవేత్త పేర్కొన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..