బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!

బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌనరాగంతో ఉద్యోగులకు ఉద్వాసన..!

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు […]

Pardhasaradhi Peri

|

Sep 07, 2019 | 2:30 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిస్తున్నది ఆధునిక టెక్నాలజీ..టెలికాం రంగంలో పుట్టుకొచ్చిన కొత్త టెక్నాలజీ..ఒకనాటి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతు నొక్కేసింది. కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తోంది. తాను బతికేందుకు కావాల్సిన జవసత్వాలను తిరిగి పుంజుకునే క్రమంలో..సంస్థంపై ఆధారపడ్డి జీవనోపాధిని పొందుతున్నవేలాది ఉద్యోగుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)అయితే,..ఎయిర్‌టెల్‌, ఐడియా లాంటి సంస్థలు వచ్చాక..వాటితో పోటీ పడలేకపోయింది. తాజాగా వచ్చిన రిలయన్స్‌ జియో..మిగతా టెలికాం సంస్థలన్నింటికీ గట్టి పోటీ ఇవ్వడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. రూ. 15 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ..వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం తెస్తోంది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ ద్వారా తొలగించబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్‌ రాగానే ఉద్యోగులను తొలగించే పని మొదలుపెడతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ ప్రవీణ్‌ కుమార్‌ పర్వార్‌ తెలలిపారు. రిటైర్మెంట్‌ స్కీమ్‌ అమలైన తర్వాత లక్షల్లో శాలరీలు తీసుకుంటున్న సీనియర్లు చాలా మంది సంస్థ నుంచీ బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో బీఎస్‌ఎన్ఎల్‌ కొత్తగా లక్ష మందిని నియమించుకోనుంది. ఐతే..వాళ్లందరికీ తక్కువ శాలరీలే ఉంటాయి. అలాగే మరికొంత మందిని కాంట్రాక్ట్‌ పద్దతుల్లో తీసుకుంటుంది. అందువల్ల సంస్థలో నిర్వహణ భారం దాదాపు సగం తగ్గుతుంది. ఈ కారణంగా రిటైర్మెంట్‌ తీసుకునేవారికీ భారీగా క్యాష్‌ రివార్డ్‌ ఇస్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే..వీలైనంత మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే పరిస్థితులు కల్పించేందుకే గత కొంతకాలంగా జీతాల చెల్లింపును ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu