థియేటర్ల ఓపెనింగ్‌కు శుక్ర‌వారం సెంటిమెంట్… బొమ్మ పడేది.. గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడంటే..

తెలంగాణలో సినిమా థియేటర్లు ప్రారంభానికి శుక్రవారం సెంటిమెంట్ అడ్డొస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిట‌ర్లు ఒప్పుకుంటే తప్ప తెరుచుకునే పరిస్థితి లేదు...

థియేటర్ల ఓపెనింగ్‌కు శుక్ర‌వారం సెంటిమెంట్... బొమ్మ పడేది.. గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడంటే..
CInema Theatre
Follow us

|

Updated on: Nov 24, 2020 | 10:31 AM

Friday Sentiment : కరోనా విజృంభన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ తరవాత అన్నీ తెరుచుకున్నప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇచ్చినప్పటికీ.. సెంటిమెంట్ అడ్డుపడింది. సినిమా ప్రపంచానికి శుక్రవారం గుమ్మడికాయ కొట్టడం ఓ సెంటిమెంట్.. దీంతో థియేటర్ల ఓనర్లు తెరిచేందుకు వెనకడుగువేస్తున్నాయి. అయితే.. డిసెంబ‌ర్ 4 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఈవాళ‌, రేప‌ట్లో ప్రొడ్యూస‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న బేటీలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నిర్మాత ఇష్ట‌ప‌డితే త‌ప్ప‌, బొమ్మ ప‌డ‌దంటున్నారు ఎగ్జిబిట‌ర్సు. విడుద‌ల తేదీ ప్ర‌చారానికి స‌మ‌యం ఉండాల‌ని నిర్మాత‌ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ తో థియేటర్‌ల ఓపెనింగ్‌కు అనుమతినిచ్చింది. థియేటర్లో ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా థియేటర్ లో సానిటైజ్ అందుబాటులో ఉంచాలని తెలిపింది.

థియేటర్ లోపల ఏసీ టెంపరేచర్ కూడా 24 నుండి 30 డిగ్రీలవరకు ఉంచాలని పేర్కొంది. ఇక సర్కార్ అనుమతిచ్చినప్పటికి ప్రజలు థియేటర్లకు వస్తారా లేదా అన్న ప్రశ్న మొదలైంది. ఓటిటికి అలవాటు పడ్డ జనాలు మళ్ళీ థియేటర్ల వైపు మల్లుతారా లేదా అన్నది చూడాలి.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!