జమ్మూకశ్మీర్​లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్​గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.  గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.  వారికి దీటుగా బదులిచ్చిన భారత సైన్యం నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది. కుప్వారా జిల్లాలో ఇద్దరు మిలిటెంట్స్‌ని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి వద్ద నుంచి […]

జమ్మూకశ్మీర్​లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Ram Naramaneni

|

Mar 15, 2020 | 4:14 PM

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్​గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.  గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.  వారికి దీటుగా బదులిచ్చిన భారత సైన్యం నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది.

కుప్వారా జిల్లాలో ఇద్దరు మిలిటెంట్స్‌ని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని విల్గం ప్రాంతంలోని షేక్‌పోరా తారత్‌పోరా నివాసితులు నజీర్ అహ్మద్ వాని, బషీర్ అహ్మద్ వానిగా గుర్తించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu