25ఏళ్ల యువతీ, యువకుడికి కరోనా లక్షణాలు..! ఐదు దేశాలు చుట్టేసి వచ్చిన యువతి

చైనాలో కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ చైనా బయట వేగంగా విజృంభిస్తోంది కరోనా వైరస్. తెలుగురాష్ట్రాల్లోనూ కొవిడ్-19 పంజా విసురుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ కరోనా హై అలర్ట్ కొనసాగుతుండగా తాజాగా తిరుపతిలో....

25ఏళ్ల యువతీ, యువకుడికి కరోనా లక్షణాలు..! ఐదు దేశాలు చుట్టేసి వచ్చిన యువతి
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 15, 2020 | 3:56 PM

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్..కొవిడ్-19 దెబ్బకు అన్ని దేశాలూ విలవిల్లాడుతున్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్‌తో పాటు పలు దేశాల్లో జనం పిట్టల్లా రాలుతున్నారు. చైనాలో కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ చైనా బయట వేగంగా విజృంభిస్తోంది కరోనా వైరస్. తెలుగురాష్ట్రాల్లోనూ కొవిడ్-19 పంజా విసురుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ కరోనా హై అలర్ట్ కొనసాగుతుండగా తాజాగా తిరుపతిలో మరో రెండు కరోనా అనుమానిత కేసులు మరింత కలవరం రేపుతున్నాయి.

తిరుపతిలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు యువతీ యువకులు కరోనా వైరస్ లక్షణాలతో రుయా ఆస్పత్రిలో చేరారు. మార్చి 15న వారు రుయాలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక కరోనా ఐసోలేషన్ వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ కూడా 25 సంవత్సరాల లోపులో ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడు తిరుపతి వాసిగా గుర్తించారు. ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఈ యువకుడికి జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు. ఇక ఆస్పత్రిలో చేరిన యువతి..ఏకంగా ఐదు దేశాల చుట్టి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు బయటపడడంతో వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి..స్విమ్స్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఈ రిపోర్ట్స్ రావడానికి 24 గంటల సమయం పట్టనుంది.