AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై యుద్ధానికి…నేను సైతం: మెగాస్టార్

ఇప్పటికే కరోనాపై యుద్ధం ప్రకటించాయి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను మెగాస్టార్ చిరంజీవి...

కరోనాపై యుద్ధానికి...నేను సైతం: మెగాస్టార్
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2020 | 8:36 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గుబులురేపుతోంది. భారత్‌లోనూ రోజు రోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 107 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కరోనాపై యుద్ధం ప్రకటించాయి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంసించారు. కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చిరంజీవి. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేయడం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉధ్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు.

Follow Us
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..