కరోనా భయానకమైనదేమీ కాదు: సీఎం జగన్

కరోనా వైరస్‌పై ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు...

కరోనా భయానకమైనదేమీ కాదు: సీఎం జగన్
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 15, 2020 | 6:25 PM

కరోనా వైరస్‌పై ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు. కరోనా వైరస్‌ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా వైరస్‌ మన దేశంలో పుట్టింది కాదన్నారు. కరోనా భయంకరమైన వ్యాధి కాదన్నారు. కరోనా వల్ల మనుషులు చనిపోతారన్నది కరెక్ట్‌ కాదన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఇటువంటి పరిస్థతి వచ్చినందుకు ఏపీ ప్రజలు చింతించాలన్నారు. కరోనా వచ్చినా పారాసిటమాల్‌ వేయాల్సిందేనన్నారు.