Manmohan Singh: మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

Former PM Manmohan Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం(26 డిసెంబరు 2024) సాయంత్రం ఆయన అడ్మిట్ అయ్యారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స కల్పిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది.

Manmohan Singh: మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
Manmohan Singh
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 26, 2024 | 10:29 PM

Former PM Manmohan Singh Health Updates: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం(26 డిసెంబరు 2024) సాయంత్రం ఆయన అడ్మిట్ అయ్యారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స కల్పిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ వయస్సు 92 ఏళ్లు.

అయితే మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు లేదా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయినట్లు పీటీఐ వార్తా సంస్థ ధృవీకరించింది. అయితే ఆయన ఏ అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారో వెల్లడించలేదు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..

మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న కథనాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్ ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

10 ఏళ్లు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. దేశంలో పేదరికం తగ్గుముఖంపట్టింది.

33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో బీఏ, ఎంఏలో టాపర్‌గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ డీ ఫిల్ చేశారు.