ఇండియాలో ఆర్ధిక మాంద్యం ? విదేశీ ఇన్వెస్టర్ల షాకింగ్ డెసిషన్ !

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మెల్లగా ఆర్థిక సంక్షోభంవైపు పయనిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఇండియాలోనూ  ఆర్థిక మాంద్యం ఆనవాళ్లు కనబడుతున్నాయి.

ఇండియాలో ఆర్ధిక మాంద్యం ? విదేశీ ఇన్వెస్టర్ల షాకింగ్ డెసిషన్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 11:45 AM

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మెల్లగా ఆర్థిక సంక్షోభంవైపు పయనిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఇండియాలోనూ  ఆర్థిక మాంద్యం ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత దేశం నుంచి 16 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. ఆసియా దేశాల నుంచి వారు మొత్తం 26 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోగా ఇందులో ఈ సొమ్ము కూడా చేరి ఉంది. వారి ఈ నిర్ణయం ఆసియా దేశాల్లో క్రమంగా బలపడుతున్న ఆర్ధిక బలహీనతలను నిరూపిస్తోందని, జరుగుతున్న  ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని యుఎస్ లోని కాంగ్రెషనల్ రీసెర్చ్ సెంటర్ తన తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్-19   కారణంగా గ్లోబల్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఎలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో ఈ నివేదికలో ప్రస్తావించారు. యూరప్ దేశాల్లో 30 మిలియన్లకు పైగా యువత తమకు ప్రభుత్వాలు భృతి కల్పించాలని దరఖాస్తులు పెట్టుకున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. 1995 లో యూరోజోన్ ఎకానమీ సీరీస్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికానికి 3.8 శాతం తగ్గుదల  నమోదైందని నివేదిక తెలిపింది. యూరప్ లో ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి జీడీపీ 4.8 శాతం తగ్గినట్టు ప్రిలిమినరీ డేటా వెల్లడించింది. పాలసీల రూప కల్పనలో అభివృధ్ది చెందిన, వర్ధమాన దేశాల మధ్య వైరుధ్యాల వల్ల కూడా ఆర్థిక వ్యవస్థలు వేర్వేరు రూపాల్లో బలహీనంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సైతం.. ఈ గ్లోబల్ ఎకానమీ తగ్గుతున్న తీరు తాను అంచనా వేసినదానికన్నా చాలా తక్కువస్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.