Cristiano Ronaldo: ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో.. వీడియో వైరల్..!

లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో తన కుటుంబంతో కలిసి లాప్‌ల్యాండ్‌లో క్రిస్మస్ పండుగను ఎంజాయ్ చేస్తూ జరుపుకున్నాడు. అయితే ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? ఈ వేడుకల్లో క్రిస్టియానో ​​రొనాల్డో చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Cristiano Ronaldo: ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో.. వీడియో వైరల్..!
Cristiano Ronaldo
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 26, 2024 | 4:55 PM

లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ​​రొనాల్డో ఏం చేసినా, ఏ పోస్టు సోషల్ మీడియాలో పెట్టినా అదీ సెన్సేషల్ అవుతూ ఉంటుంది. అయితే ఇదే క్రిస్టియానో ​​రొనాల్డో ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. క్రిస్టియానో ​​రొనాల్డో క్రిస్మస్ సెలవులను ఆనందించడానికి తన కుటుంబంతో కలిసి ఫిన్‌లాండ్‌లోని లాప్‌లాండ్‌కు వెళ్లారు. ఈసారి రొనాల్డో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది. ఇంత చలిలో బట్టలు లేకుండా నిలబడటమే కష్టం రా బాబు అంటే..క్రిస్టియానో ​​రొనాల్డో చల్లని  నీటిలోకి దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే 93.1 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. స్విమ్మింగ్ పూల్‌లో దిగే ముందు ‘ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది” అని స్వయంగా ​​రొనాల్డో వీడియోలో పేర్కొన్నాడు.

రొనాల్డో నెమ్మదిగా పూల్‌లో మెట్లుదిగుతాడు. ఎముకలు కొరికే చలిలో ఇలాంటి ప్రయోగం చేయడం ఎంత కష్టమో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. రొనాల్డో పుల్‌లోకి దిగుతుండగా, అతని వెనుక ఉన్న వ్యక్తి పూల్ లోతు 2 మీటర్లు అని చెప్పాడు. దీని తరువాత, రొనాల్డో ఒక నిచ్చెన పట్టుకుని తన మెడ వరకు నీటిలోకి దిగి, నీరు కొద్దిగా చల్లగా ఉందని, చాలా బాగుంది అని ఉత్సాహంగా చెప్పాడు. కానీ కొన్ని నిమిషాల్లో, రొనాల్డో నీటి నుండి బయటకు వెళ్లిపోతాడు.

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మంచు స్నానాలు ట్రెండ్‌గా మారాయి. చల్లటి నీళ్లలో స్నానం చేయడం వల్ల ఊబకాయం, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. క్రిస్టియానోకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది. దీనిపై ఓ ఆరోగ్య నిపుణుడు, శాస్త్రవేత్త నవీంద్ర సూడూ స్పందించారు. చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఇది శరీర వాపును తగ్గిస్తుందని కండరాల రికవరీని మెరుగుపరుస్తుందని తెలిపారు. దీనితో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందన్నారు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్ గురించి మనందరీకి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి