AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foot washing: నిద్ర పోయే ముందు కాళ్లు ఎందుకు కడుక్కోవాలో తెలుసా? హిందూ ధర్మ శాస్త్రాల్లో దాగున్న రహస్యం ఇదే..

హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే ముందు, తినడానికి, నిద్రపోయే ముందు పాదాలను కడుక్కోవాలని చెబుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్‌ తెలిస్తే మీరూ పాటిస్తారు..

Foot washing: నిద్ర పోయే ముందు కాళ్లు ఎందుకు కడుక్కోవాలో తెలుసా? హిందూ ధర్మ శాస్త్రాల్లో దాగున్న రహస్యం ఇదే..
Foot Washing
Srilakshmi C
|

Updated on: Jul 28, 2022 | 9:58 PM

Share

surprising reasons to wash feet before bed: హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే ముందు, తినడానికి, నిద్రపోయే ముందు పాదాలను కడుక్కోవాలని చెబుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్‌ తెలిస్తే మీరూ పాటిస్తారు. మన పూర్వీకులు శతాబ్దాలుగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుగుకోవడం శరీరానికి, మానసిక స్థితిని నయం చేయడానికి ఎంతో సహాయపడుతుందని మన పెద్దలు నమ్ముతారు. హిందూ మతంలో ఇంటిని దేవాలయంలా పరిగణిస్తారు. అందుకే బయటి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే షూస్, చెప్పులను ఇంటి బయటే తీసేయాలని చెబుతుంటారు.

పడుకునే ముందు మన పాదాలను ఎందుకు కడుక్కోవాలంటే..

ఇవి కూడా చదవండి

శాస్త్రాల ప్రకారం.. ఒక పగలు కష్టపడి రాత్రి అలసిపోయిన తర్వాత శరీరం విశ్రాంతి తీసుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రపోవాలని, కాళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలు కడుక్కోకుండా నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి సక్రమంగా ప్రసారం కాదనేది శాస్త్రోక్తి. శరీరంలో అనేక శక్తి చక్రాలు ఉంటాయి. నిద్రలో ఈ చక్రాలన్నీ మూసుకుపోతాయి. నీరు శరీరానికి శక్తినిచ్చే అనేక విద్యుదయస్కాంత లక్షణాలను కలిగి ఉంటాయి. నీటితో పాదాలను శుభ్రరపచుకుని నిద్రించడం వల్ల శరీర చక్రాలను నియంత్రించవచ్చని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. నీరు శరీరం శక్తి స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మానసిక భావోద్వేగాలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అందుకే పడుకునే ముందు పాదాలను నీళ్లతో కడుక్కోవడం మంచిదని పెద్దలు చెబుతారు. సైన్స్‌ ప్రకారం..బాడీ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. బ్యాక్టీరియా మొదట పాదాలకు అంటుకుని మొత్తం శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల, పడుకునే ముందు శరీరంలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా ప్రవేశించకుండా ఉండటానికి పాదాలను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. శరీరంలో అలసట, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కాళ్లు కడుక్కోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, మంచి నిద్ర పడుతుందని, వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.