Calcium Deficiency: శరీరంలో కాల్షియం లోపిస్తే ఏమౌతుందో తెలుసా? హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్ ఇంకా..
మన ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు చాలా అవసరం. వాటిల్లో కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం. శరీర అవయవాల పెరుగుదలకు కాల్షియం పాత్ర..
Calcium Deficiency Symptoms and Causes in telugu: మన ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు చాలా అవసరం. వాటిల్లో కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం. శరీర అవయవాల పెరుగుదలకు కాల్షియం పాత్ర కీలకమైనది. ఇది ఎముకలను బలపరచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం స్థాయిలు వయస్సుల వారీగా మారుతుంటుంది. శరీరంలో దీని అవసరం అప్పుడే పుట్టిన శిశువు దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు మారుతూ ఉంటుంది. ఎముకలు, గోళ్లను బలోపేతానికి, నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యాన్ని కాల్షియం మెరుగుపరుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రావడానికి కూడా కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళల్లో కాల్షియం లోపం తలెత్తితే మెనోపాజ్ సమయంలో అనేక అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది.
శరీరంలో కాల్షియం లోపిస్తే ప్రధానంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఎముకల బలహీనత, ఎముకల్లో నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్లలో తిమ్మిరి, కాళ్లలో జలదరింపు, జ్ఞాపకశక్తి క్షీణత, మహిళల్లో రుతుక్రమ సమస్యలు వంటి ప్రధాన లక్షణాలు. శరీరంలో కాల్షియం లోపిస్తే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారిలో ఎముకలు సన్నబడి బలహీనంగా మారతాయి. ఎముక విరిగిపోయే అవకాశం కూడా ఉంది. శరీరంలో కాల్షియం లోపిస్తే పేగుల్లో కణితులు ఏర్పడి.. పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మహిళలు వయస్సు పెరిగే కొద్దీ కాల్షియం లోపాన్ని అధిగమించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కాల్షియం లోపిస్తే గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. శరీరంలో తగినంత కాల్షియం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తుంది. శరీరంలో కాల్షియం లోపిస్తే బీపీ వస్తుంది. అధిక రక్తపోటు స్ట్రోక్‌కు దారి తీస్తుంది.