మీరు వాడే వాష్‌రూమ్‌లో కరోనా.. జాగ్రత్త !
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి రోజుకో భయంకరమైన నిజం బయట పడుతోంది. కరోనా రక్కసి నుంచి రక్షించుకునేందుకు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడంతోపాటు.. కరోనాను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నా

Covid-19 at Flushing Public Toilets : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి రోజుకో భయంకరమైన నిజం బయట పడుతోంది. కరోనా రక్కసి నుంచి రక్షించుకునేందుకు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడంతోపాటు.. కరోనాను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇవన్నీ తప్పించుకునే మార్గాలు అయితే అది ఎక్కడెక్కడ దాగి ఉంటుందనేది పరిశోధకులు బయట పెడుతున్నారు.
ఇందులో కొన్ని వైరస్ పీడ విరగడయ్యేంత వరకు మానవాళి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తుండగా.. మరికొన్ని వైరస్‌పై కొత్త అస్త్రాలు సిద్ధమవుతున్నాయని చెబుతున్నాయి. మరికొన్ని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టి ముందున్నాయ్ మంచి రోజులు అనే భరోసా కల్పిస్తున్నారు. అలా ఇటీవల వెలువడిన ఆ పరిశోధనలు ఇలా ఉన్నాయి.
మనం నిత్యం వినియోగించే.. వాష్‌రూమ్‌ల్లో మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా వెంట వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఇక్కడే అసలు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ముందు ఎవరైనా కరోనా బాధితుడు వాష్‌రూమ్‌ను వాడి ఉంటే ఆ తరువాత వెళ్లేవాళ్లు నీటిని ఫ్లష్ చేస్తే కరోనా వైరస్‌ను కలిగిన నీటి రేణువులు భారీఎత్తున అక్కడ విస్తరిస్తాయని ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ఓ పరిశోధనను ప్రచురించింది. తద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని ఆ కథనంలో పేర్కొంది. సామూహిక మరుగుదొడ్లు వాడే సమయంలో, కార్యాలయాల్లోనూ వాష్‌రూమ్‌లు వినియోగించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని అంటున్నారు.




