నాలుగేళ్ల బాలుడితో సహా ఐదుగురు ఆత్మహత్య
మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నాలుగేళ్ల చిన్నారితో సహా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అతని భార్య, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నాలుగేళ్ల చిన్నారితో సహా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అతని భార్య, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఖేరీ వెల్లడించిన వివరాల ప్రకారం… టికమ్‌ఘర్ జిల్లా ప్రధాన కార్యాలయానికి 35 కిలోమీటర్ల దూరంలోని ఖర్గాపూర్ పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగి ధర్మదాస్ సోని(62) కుటుంబం నివాసముంటోంది. ఉదయం ఇంటి నుండి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా ధర్మదాస్ అతని భార్య సోని(62), భార్య పూన(55), కొడుకు మనోహర్(27), కొడలు సోనమ్(25), నాలుగేళ్ల మనవడు ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానిక పోలీసులను అప్రమత్తం చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ ఖరే తెలిపారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు.




