తుపాకీతో కాల్చి పిల్లిని చంపేశారు
బెంగళూరులో దారుణం జరిగింది. ఓ పిల్లిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై పిల్లి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బెంగళూరులో దారుణం జరిగింది. ఓ పిల్లిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై పిల్లి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే…అబ్రహాం ఆంటోనీ అనే స్థానిక స్కైహైక్ విల్లాస్లో నివశిస్తున్నాడు. అతడికి జంతువులు అంటే ఇష్టం ఉండటంతో ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. మంగళవారం యార్నింగ్ ఇంటి వెనక గార్డెన్‌లో రెండు సార్లు కాల్పులు జరిగిన శబ్ధం వినిపించి పరిగెత్తుకెళ్లాడు అబ్రహాం. ఆ తుపాకీ బుల్లెట్లు తగిలి, తన పెంపుడు పిల్లి నెత్తుటి మడుగుల్లో పడి ఉండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. వెంటనే సర్జాపూర్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీలుసులు.. పిల్లి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయించేందుకు వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. పిల్లిపై కాల్పులు జరిపిందెవరనే కోణంలో విచారిస్తున్నారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!