Breaking:కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు
నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వింజమూరు మండలం చంద్రపడియ వద్ద గల వినయ్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వింజమూరు మండలం చంద్రపడియ వద్ద గల వినయ్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో కార్మికులను నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగానే ఆస్తినష్టం కూడా వాటిల్లిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.




