హైదరాబాద్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 4:27 pm, Tue, 2 June 20
హైదరాబాద్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బందికి కానీ, కస్టమర్లకు కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. నష్టం అంచనా వేయటానికి ప్రత్యేక బృందం వస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..