యూఎస్ తుది డిబెట్ః కరోనాపై ట్రంప్-జో బిడెన్ మధ్య వాడివేడీ చర్చ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య నాష్‌విల్లేలో చివరి డిబెట్ నిర్వహించారు.

యూఎస్ తుది డిబెట్ః కరోనాపై ట్రంప్-జో బిడెన్ మధ్య వాడివేడీ చర్చ
Follow us

|

Updated on: Oct 23, 2020 | 12:31 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య నాష్‌విల్లేలో చివరి డిబెట్ నిర్వహించారు. రెండు నిమిషాల పాటు అంతరాయం లేకుండా మాట్లాడే నిబంధనతో చర్చ కొనసాగింది. ట్రంప్‌, బైడెన్‌ మధ్య మాటల యుద్ధం వాడివేడీగా సాగింది. కొవిడ్‌ సన్నద్ధత, అమెరికా కుటుంబాలు, పర్యావరణ మార్పులు, జాతీయ భద్రతా, నాయకత్వం సహా ఆరు ప్రశ్నలపై ఇద్దరు నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన వైరస్‌ కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థనే కొన్నాళ్ల పాటు మూసివేశామన్నారు.

అమెరికా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మధ్య మూడోసారి డిబెట్ నడిచింది. కాగా, కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనాను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, చైనాకు రాకపోకలు నిషేధించడంపై ట్రంప్ ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. కరోనా మరణాలకు కారణమైన వారు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని బిడెన్ ధ్వజమెత్తారు. తనను అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకోవాలో దేశ ప్రజలకు బాగా తెలుసని బిడెన్ వెల్లడించారు.