AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో ప్రియుడితో భార్య నగ్నచిత్రాలు.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

సోషల్ మీడియాలో ప్రియుడితో కలిసి భార్య నగ్న చిత్రాలు భరించలేకపోయాడు. ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త.

సోషల్ మీడియాలో ప్రియుడితో భార్య నగ్నచిత్రాలు.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Balaraju Goud
|

Updated on: Nov 06, 2020 | 3:08 PM

Share

సోషల్ మీడియాలో ప్రియుడితో కలిసి భార్య నగ్న చిత్రాలు భరించలేకపోయాడు. ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపిందిజ త‌న ప్రియుడితో న‌గ్నంగా, స‌న్నిహితంగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ మారాయి. ఈ దృశ్యాలు వివాహిత భ‌ర్త‌కు చేర‌డంతో కోపంతో రగిలిపోయాడు. ఆమెను అతి దారుణంగా క‌త్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని థానే జిల్లాలో చోటు చేసుకుంది.

భివాండిలోని అన్సార్ న‌గ‌ర్‌కు చెందిన రఫీక్ మ‌హ్మ‌ద్ యూన‌స్‌(50)కు భార్య న‌స్రీన్‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. అయితే, లాక్‌డౌన్ కార‌ణంగా యూన‌స్ ఉపాధి కోల్పోయాడు. దీంతో త‌న భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌ను తీసుకుని నాగౌన్ ఏరియాలో ఉంటున్న త‌న సోదరి నివాసానికి మకాం మార్చాడు. అయితే, నస్రీన్‌కు నాగౌన్ ప్రాంతానికి చెందిన మ‌రో యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్పడింది. ఇది కాస్త ఇద్దరి మధ్య వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. కాగా, ఆ యువకుడితో నస్రీన్ స‌న్నిహితంగా ఉన్న దృశ్యాలు, న‌గ్న వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ దృశ్యాలు భ‌ర్త యూన‌స్‌కు చేర‌డంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోన‌య్యాడు. సోద‌రి నివాసంలోనే భార్య‌ను క‌త్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. ఆ త‌ర్వాత శాంతిన‌గ‌ర్ పోలీసుల వెళ్లి యూన‌స్ లొంగిపోయాడు. న‌స్రీన్ ప్రియుడిని స‌ద్దాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధి కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Follow Us
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
దవడలో నొప్పి.. గొంతులో మంట! ఇవి కనిపిస్తే గుండెకు రిస్క్
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
అల్యూమినియం ఫాయిల్‌లో ఉడికించిన ఆహారం మీరూ తింటున్నారా?
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి సారె సమర్పణ
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
ముప్పుతిప్పలు పెట్టే పైథాగరస్ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక కథ ఇదే
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
Video: జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..!
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
టిఫిన్‌కు ముందు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి.. ఇక అమేజింగే
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్‌ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?
చెరువుల్లోకి చికెన్‌ వ్యర్థాలు.. మీరు తినే చేపలు సురక్షితమైనవేనా?