AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?

T20 World Cup 2026 Prize Money: క్రీడ ఏదైనా ఆటగాళ్ల శ్రమ, అభిమానుల భావోద్వేగాలు ఒకటే అయినప్పటికీ, వ్యాపార సామ్రాజ్యం, అంతర్జాతీయ ఆదరణ విషయానికి వస్తే ఫుట్‌బాల్‌ అగ్రస్థానంలోనే ఉంటుంది. క్రికెట్‌కు కొన్ని దేశాల్లోనే విపరీతమైన క్రేజ్ ఉంటే, సాకర్ మాత్రం ప్రపంచంలోని ప్రతి మూలకూ పాకింది అనడానికి ఈ భారీ ప్రైజ్ మనీ వ్యత్యాసమే సజీవ సాక్ష్యం.

ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?
Fifa World Cup Vs T20 World Cup
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 12:52 PM

Share

FIFA World Cup 2026 Prize Money: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ మహాసంగ్రామం, ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డులతో మన ముందుకు వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్, భారీ ప్రైజ్ మనీతో సాగుతున్న ఈ టోర్నీతో పోల్చితే, ప్రపంచ క్రికెట్ బాద్‌షా ఐసీసీ టీ20 ప్రపంచకప్ బహుమతి మొత్తం ఎంత తక్కువో తెలిస్తే క్రీడాభిమానులు ముక్కున వేలేసుకోవడం ఖాయం.

చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం..

విశ్వవ్యాప్తంగా కోట్ల మంది గుండెచప్పుడు ఫుట్‌బాల్. ఈసారి ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త చరిత్రకు వేదికైంది. మూడు ఆతిథ్య దేశాలు, 16 అత్యాధునిక క్రీడా మైదానాలు, రికార్డు స్థాయిలో 48 జట్లు ఈ మహాసంగ్రామంలో తలపడుతున్నాయి. 39 రోజుల పాటు సాగే ఈ క్రీడా పండుగలో ఏకంగా 104 మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి. 1998 తర్వాత టోర్నీ పరిధిని ఇంతలా విస్తరించడం ఇదే తొలిసారి. కేవలం జట్ల సంఖ్య మాత్రమే కాదు, ఈసారి విజేతలకు అందించే బహుమతి నిధులు కూడా ఆకాశాన్ని తాకాయి. గత ఎడిషన్‌తో పోలిస్తే ఏకంగా 50 శాతం నిధులను పెంచి, మొత్తం 655 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీగా ఫిఫా ప్రకటించింది.

క్రికెట్ వర్సెస్ ఫుట్‌బాల్: ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా!

మన దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారు. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయంతో ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ క్రేజ్ ముందు క్రికెట్ ఎంత చిన్నదో ప్రైజ్ మనీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తం టోర్నీ బహుమతి నిధి కేవలం 11.25 మిలియన్ డాలర్లు మాత్రమే. కానీ, ఫిఫా ప్రపంచకప్ 2026 మొత్తం బడ్జెట్, ప్రైజ్ మనీతో పోల్చితే ఇది గోరంత మాత్రమే అని చెప్పక తప్పదు.

ఫిఫా విజేత సొంతం చేసుకునేది ఎంతంటే?

ఫిఫా కౌన్సిల్ ఆమోదించిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది టోర్నీలో పాల్గొనే జట్లకు పంచే మొత్తం నిధులు అక్షరాలా 727 మిలియన్ డాలర్లు. ఇందులో ప్రధాన వాటా అయిన 655 మిలియన్ డాలర్లను జట్ల ప్రదర్శన ఆధారంగా కేటాయించారు.

విజేత (ఛాంపియన్): 50 మిలియన్ డాలర్లు (సుమారు 415 కోట్ల రూపాయలు)

రన్నరప్: 33 మిలియన్ డాలర్లు

మూడో స్థానం: 29 మిలియన్ డాలర్లు

నాల్గో స్థానం: 27 మిలియన్ డాలర్లు

ఇక టోర్నీకి అర్హత సాధించి, గ్రూప్ దశలోనే వెనుదిరిగే చివరి 33-48 స్థానాల్లోని జట్లకు కూడా తలో 9 మిలియన్ డాలర్లు దక్కుతాయి. దీనికి తోడు ప్రతి జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్ డాలర్లు అదనంగా ఇస్తారు. అంటే ఈ టోర్నీలో అడుగుపెట్టిన ప్రతి దేశానికి కనీసం 10.5 మిలియన్ డాలర్ల (దాదాపు 87 కోట్ల రూపాయలు) ఆదాయం గ్యారెంటీ!

మన టీ20 ప్రపంచకప్ విజేతకు వచ్చింది ఎంత?

మరోవైపు, ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియాకు దక్కిన ప్రైజ్ మనీ కేవలం 2.63 మిలియన్ డాలర్లు (సుమారు 22 కోట్ల రూపాయలు) మాత్రమే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.42 మిలియన్ డాలర్లు దక్కాయి. అంటే ఫిఫా టోర్నీలో ఆఖరి స్థానంలో నిలిచే జట్టుకు వచ్చే బహుమతి సొమ్ములో సగం కూడా మన క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌కు రాకపోవడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us