స్టెప్పులేసిన మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. జతకలిసిన పంజాబ్ సీఎం అమరీందర్.. వీడియో వైరల్

Farooq Abdullah Dances With Captain Amarinder Singh: ఆయనొక జాతీయ నాయకుడు.. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి.. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..

  • Shaik Madarsaheb
  • Publish Date - 9:06 pm, Fri, 5 March 21
స్టెప్పులేసిన మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. జతకలిసిన పంజాబ్ సీఎం అమరీందర్.. వీడియో వైరల్

Farooq Abdullah Dances With Captain Amarinder Singh: ఆయనొక జాతీయ నాయకుడు.. జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే వ్యక్తి.. కానీ అలాంటి వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎవరో కాదు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా. గురువారం చండీగఢ్‌లో జరిగిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ మనవరాలి వివాహ వేడుకకు ఫరూక్‌ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ గాయకుడు మహమ్మద్‌ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు. పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేయడంతోపాటు అబ్ధుల్లా అభినయంతో ఆకట్టుకున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా డ్యాన్స్‌ చూసిన మరికొందరు ఆయనతో కలిసి స్టెప్పులేస్తూ అలరించారు.

ఈ క్రమంలో సీఎం అమరిందర్ సింగ్‌‌తోనూ అబ్దుల్లా స్టెప్పులు వేయించి అలరించారు. అయితే ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన ‘ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చెహ్రే’తోపాటు ‘గులాబీ ఆంఖే జో తెరీ దేఖీ’ పాటలకు అబ్దుల్లా, అమరిందర్ చిందులు వేయడంతో అక్కడున్న వారంతా సందడి చేస్తూ కనిపించారు.