
Bigg Boss Telugu 4 Akhil Sarthak : బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు అభిమానులు బాగానే ఉన్నారు. హౌస్ లో అడుగు పెట్టిన దగ్గరనుండీ అతడిని సపోర్ట్ చేస్తూ.. ఫైనల్ వరకు తీసుకు వచ్చారు. బిగ్ బాస్ కంటే ముందే అఖిల్ కొన్ని సీరియల్స్ లో నటించాడు. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ 4 వల్ల అఖిల్ కు మంచి క్రేజ్ లభించింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్రాడు.
తాజాగా అఖిల్ కు ఓ అభిమాని సర్ఫరైజ్ గిఫ్ట్ ఇచ్చింది. హౌస్ బయటకు వచ్చిన తర్వాత అభిమానులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాట్ చేస్తూ ఉన్నాడు అఖిల్. ఈ క్రమంలోనే తనకు నచ్చిన ల్యాప్ టాప్‌ను విజయవాడ చెందిన ఓ అభిమాని గిఫ్ట్ తీసుకొచ్చింది. జయలక్ష్మి అనే అభిమాని అఖిల్‌కు ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇచ్చింది. దీనికి సంబంధిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు అఖిల్. ” నా మీద ఎందుకింత ప్రేమ.. నేనేం చేశాను అంతగా నాకు కూడా అర్థం కావడం లేదు.. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడిపోయాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Pawan Kalyan : ‘గోపాల గోపాల’ దర్శకుడితో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా.. కానీ ఈసారి ఇలా…