AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నోవా వాహనాన్ని పోలీస్ ఎస్కార్ట్ వాహనంలా మార్చేశారు..సినిమా స్టైల్లో స్మగ్లింగ్.. కట్ చేస్తే..

ఒడిశా మల్కాన్‌ గిరి జిల్లా బలిమెలలో గంజాయి స్మగ్లర్లు ఖాకీలకే మస్కా కొట్టే ప్రయత్నం చేశారు. ఎంచక్కా ఇన్నోవా వాహానాన్ని పోలీస్ ఎస్కార్ట్‌ వాహనంలా ముస్తాబు చేశారు.

ఇన్నోవా వాహనాన్ని పోలీస్ ఎస్కార్ట్ వాహనంలా మార్చేశారు..సినిమా స్టైల్లో స్మగ్లింగ్.. కట్ చేస్తే..
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2021 | 9:32 PM

Share

ఒడిశా మల్కాన్‌ గిరి జిల్లా బలిమెలలో గంజాయి స్మగ్లర్లు ఖాకీలకే మస్కా కొట్టే ప్రయత్నం చేశారు. ఎంచక్కా ఇన్నోవా వాహానాన్ని పోలీస్ ఎస్కార్ట్‌ వాహనంలా ముస్తాబు చేశారు. పోలీస్ స్టిక్కర్‌, వాహనం పైన బ్లూ కలర్‌ బీకాన్‌ లైట్‌ను అమర్చారు. ఇక తమను ఎవరు ఆపుతారులే అనుకున్నారు. గంజాయి బస్తాలను కారులో నింపుకున్నారు. అక్రమ రవాణా షురూ చేశారు.  కొన్నిసార్లు వారి ప్లాన్ బానే వర్కువుట్ అయ్యింది. ఆ తరువాత పోలీసులు అనుమానం రావడంతో ఆ వాహనంపై నిఘాపెట్టారు. ఆపి తనిఖీ చేసే సరికి..అసలు విషయం బయటపడింది. లోపల సెటప్ చూసి ఖాకీలు కంగుతిన్నారు.

ఇన్నోవా వాహనంతో పాటు వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నకిలీ పోలీసు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. చిత్రకొండనుంచి గంజాయిని బీహార్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

Also Read:

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..