AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని ధర్మాసనం భావించింది.

AP Local Body Polls:  ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:45 PM

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని ధర్మాసనం భావించింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వ అభిప్రాయాలను ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21లను ఉల్లంఘించేలా ఎస్‌ఈసీ నిర్ణయం ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ టీడీపీకి వత్తాసు పలుకుతూ ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారని మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో హైకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.

Also Read: Virat Anushka baby: తండ్రైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క